హీరో సూర్య లేటెస్ట్ మూవీ సురారై పోట్రు. గురు ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పైలట్ గా కనిపించనున్నారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు సాయంత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. నేడు సాయంత్రం 4 గంటలకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది. 2డి ఎంటర్టైన్మెంట్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మరో విశేషం ఏమిటంటే టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సురారై పోట్రు మూవీలో ఓ కీలకపాత్ర చేస్తున్నారు. మోహన్ బాబు పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగివుండే అవకాశం కలదు. అపర్ణ బాలమురళి సూర్య కి జంటగా నటిస్తుండగా, జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.


