బాలయ్యబాబు కలిసొచ్చిన ఫార్మాట్ ట్రై చేసినట్టున్నాడు

బాలయ్యబాబు కలిసొచ్చిన ఫార్మాట్ ట్రై చేసినట్టున్నాడు

Published on Nov 22, 2019 11:00 PM IST

Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ రూలర్ టీజర్ నిన్న విడుదలై యూట్యూబ్ లో సంచలనంగా మారింది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. యాక్షన్ ఎమోషన్స్ రొమాన్స్ కామెడీ ఇలా అన్ని అంశాలు కలిగిన పూర్తి స్థాయి కమర్షియల్ మూవీగా రూలర్ ఉంటుందని టీజర్ చెప్పకనే చెవుతుంది. కాగా ఈ మూవీలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించడం ఆసక్తిని రేపుతోంది.

బాలయ్య ధర్మ అనే పవర్ ఫుల్ పోలీస్ గా మరియు బిసినెస్ మాన్ గెటప్ లో కనిపిస్తున్నారు. మరి బాలయ్యది డ్యూయల్ రోలా లేక ఒకడే డిఫరెంట్ టైం పీరియడ్స్ లో అలకనిపిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన సమర సింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల స్క్రీన్ ప్లే ఫార్మట్ లోనే రూలర్ మూవీ ఉండే అవకాశం కలదని వినికిడి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే డిసెంబర్ 20వరకు వేచి చూడాల్సిందే. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు