షూట్ కి రెడీ అవుతున్న స్టార్ హీరో …!

షూట్ కి రెడీ అవుతున్న స్టార్ హీరో …!

Published on Nov 23, 2019 8:41 AM IST

ajith

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తన స్టామినా నిరూపిస్తున్నారు. అతి పెద్ద మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ సినిమాలు వరుస రికార్డ్స్ సాధిస్తున్నాయి. ఈఏడాది మొదట్లో విశ్వాసం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆయన రీసెంట్ గా నెర్కొండ పార్వై అనే చిత్రంలో లాయర్ గా నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. కాగా అజిత్ ఇటీవలే ఓ నూతన చిత్రాన్ని ప్రకటిచడంతో పాటు, పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది.

వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరడంతో వచ్చే నెల మూడవ వారం నుండి ఈము మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. నెర్కొండ పార్వై చిత్రాన్ని తెరకెక్కించిన హెచ్ వినోత్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం. మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయల్ రోల్ చేశే అవకాశం కలదు. ఒక పాత్రలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు