తమిళనాట హీరోలను అభిమానులు దాదాపు దేవుళ్లుగా కొలుస్తారు. ముఖ్యంగా అక్కడ మాస్ హీరోలకు ఉండే ఫాలోయింగే వేరు. ఇక కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తలపతి విజయ్ ఒకరు. రీసెంట్ గా ఆయన బిగిల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. యాక్షన్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా దాదాపు 250కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఐతే ఈ హీరో మైనపు విగ్రహాన్ని తమిళనాడులో ఏర్పాటు చేశారు.
కన్యాకుమారిలో గల ఓ ప్రముఖ టూరిస్ట్ మ్యూజియం నందు హీరో విజయ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనితో ఆమ్యూజియం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు ఆ విగ్రహం పక్కన ఫోజులిస్తూ ఫోటోలు దిగుతున్నారట. విజయ్ తన 64వ చిత్రం ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ ఆల్రెడీ జరుగుతుండగా కర్ణాటకలో ఓ జైలుకి సంబందించిన సెట్ ఏర్పాటు చేశారట. అక్కడ విజయ్ సేతుపతి మరియు విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.


