యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్ మూవీస్ లో యమదొంగ కి ప్రత్యేక స్థానం కలదు. సూపర్ హిట్ కాంబినేషన్ అయిన ఎన్టీఆర్-రాజమౌళి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. కాగా ఇప్పుడు ఈ మూవీ తమిళంలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 2007లో యమదొంగ గా వచ్చిన ఈ చిత్రాన్ని 12ఏళ్ల తరువాత తమిళంలో విజేయన్ గా విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన తమిళ పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
వచ్చే ఏడాది ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ దేశవ్యాప్తంగా అన్ని భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ హిట్ మూవీ తమిళంలో డబ్భై విడుదల కావడం ఆసక్తి రేపుతోంది. ఇక ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ నటించిన మగధీర మూవీ తమిళంలో కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. మరి యమదొంగ తమిళ వర్షన్ కూడా చెప్పుకోదగ్గ విజయం సాధిస్తే అది ఆర్ ఆర్ ఆర్ మూవీ తమిళంలో మరింత ఆదరణ దక్కించుకోవడానికి, మంచి బిసినెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చూడాలి మరి ఎన్టీఆర్ సోసియో ఫాంటసీ మూవీతో తమిళ తంబీలను ఏమాత్రం ఆకట్టుకుంటాడో.



