నందమూరి హీరో స్పీడ్ అందుకున్నాడు

నందమూరి హీరో స్పీడ్ అందుకున్నాడు

Published on Nov 26, 2019 1:19 PM IST

Entha Manchivaadavuraa

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ పొస్ట ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది. జనవరి 15న సినిమా విడుదల ఉండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంది. అందుకే టీమ్ నిర్మాణాంతర పనుల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలని పని చేస్తోంది.

ఈ సినిమాకు ముందు 9న రజనీ ‘దర్బార్’, 11న మహేష్ ‘సరిలేర నీకెవ్వరు’, 12న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ చిత్రాలు విడుదలకానున్నాయి. దీంతో ఇన్ని పెద్ద సినిమాల మధ్య కళ్యాణ్ రామ్ మంచి ధీమాతో దిగుతున్నాడంటే సినిమాలో మంచి ఫ్యామిలీ కంటెంట్ ఉండే ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు