మొదటి చిత్రం నుండే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆరడుగుల హైట్, సాలిడ్ పర్సనాలిటీ గల శ్రీనివాస్ మాస్ హీరోకేమీ తక్కువ కాడు. ఈ మధ్య విజయాల పరంగా కొంచెం వెనుకబడ్డ ఈ కుర్ర హీరో ఇటీవల రాక్షసుడు చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మంచి వసూళ్లనే సాధించింది. కాగా సాయి శ్రీనివాస్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. కందిరీగ, రభస, హైపర్ వంటి చిత్రాలు తీసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ తమ మొదటి చిత్రంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా ఈనెల 29న ఉదయం 9:30 నిమిషాలకు రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా ఈ మూవీ ఓపెనింగ్ జరగనుంది. ఈ ఈమేరకు చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ బాడీ తో సిద్ధమయ్యారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.


