యాక్షన్ హీరోలా వస్తానంటున్న బాలయ్య..!

యాక్షన్ హీరోలా వస్తానంటున్న బాలయ్య..!

Published on Nov 30, 2019 2:37 PM IST

balakrishna 2

బాలయ్య సినిమా అంటే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. యాక్షన్ సన్నివేశాలలో బాలయ్య నట విశ్వరూపం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేదిలా ఉంటుంది. మరి అలాంటి భీకర పోరాటాలు పుష్కలంగా ఉండే మూవీతో వచ్చేస్తున్నాడు నటసింహం బాలయ్య. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇంకా కేవలం 20రోజులలో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. కాగా రేపు ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ సాంగ్ విడుదల కానుంది. ‘అడుగో..అడుగో యాక్షన్ హీరో’ అనే ఈ లిరికల్ సాంగ్ రేపు ఉదయం 11:42 నిమిషాలకు విడుదల చేయనున్నారు.

ఇక కొద్దిరోజుల క్రితం విడుదలైన రూలర్ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తుంగా, సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ మొదటిసారి బాలయ్య సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న రూలర్ మూవీ విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు