ఎన్నో వ్యప్రయాసలకోర్చి ఎట్టకేలకు అర్జున్ సురవరం మూవీ నిన్న థియేటర్స్ లోకి దిగింది. హీరో నిఖిల్, లావణ్య జంటగా అర్జున్ సురవరం మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. తమిళ దర్శకుడు టి సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. కాగా విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్లు కూడా బాగానే రాబట్టినట్టు తెలుస్తుంది.
అర్జున్ సురవరం మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొదటిరోజు 1.6 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేశారు. చిత్రానికి వస్తున్న స్పందన రీత్యా అదనపు స్క్రీన్స్ కూడా పెంచారని తెలుస్తుంది. 2016లో వచ్చిన ఎక్కడికిపోతావు చిన్నవాడా, మూవీ తరువాత హిట్ కొరకు తపిస్తున్న నిఖిల్ దాహం, అర్జున్ సురవరం తీర్చడం ఖాయంగా కనిపిస్తుంది.


