నటసింహం బాలయ్య లేటెస్ట్ మూవీ రూలర్ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘యాక్షన్ హీరో…’ వచ్చేసింది. బాలయ్య ఈ చిత్రంలో రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తూ ఉండగా వాటిలో ఒకటైన స్టైలిష్ బిజినెస్ మెన్ పాత్రను ఎలివేట్ చేసేలా ఉన్న ఈ సాంగ్ బాలయ్య రేంజ్ కి తగ్గట్టుగా ఉంది. కార్పొరేట్ దిగ్గజంగా బాలయ్య లుక్ అండ్ స్టైల్ సూపర్ అనిచెప్పాలి. ఈ పాత్రకు జోడిగా సోనాల్ చౌహాన్ కనిపిస్తుంది. బాలయ్య సినిమాకి మొదటిసారి సంగీతం అందించిన చిరంతన్ భట్, బాలయ్య గత చిత్రాలకు భిన్నంగా న్యూ ట్యూన్స్ ఇచ్చారని ఈ సాంగ్ చూస్తే అర్థం అవుతుంది.
ఏదేమైనా రూలర్ చిత్రం నుండి వచ్చిన మొదటి సాంగ్ ఆకట్టుకొనేలా ఉంది. బాలయ్య ఈ చిత్రంలో దేవా అనే మరో పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కిస్తుండగా, సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వేదిక మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈనెల 20న రూలర్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది.
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


