నితిన్ ‘చదరంగం’ మొదలుపెట్టనున్నాడా ?

నితిన్ ‘చదరంగం’ మొదలుపెట్టనున్నాడా ?

Published on Dec 1, 2019 8:30 AM IST

Nithin

హీరో నితిన్ వరుసగా కొత్త సినిమాల్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో చిత్రం చేయనున్నాడు నితిన్. ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెడుతున్నారట.

కాగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. ఇక ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తోన్న ‘భీష్మ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటివలే మొదలయ్యాయి. ఇక ఈ సినిమా కోసం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా పూర్తి అయింది. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక.

తాజా వార్తలు