‘సరిలేరు నీకెవ్వరు’.. మాస్ సాంగ్ వచ్చేస్తోంది !

‘సరిలేరు నీకెవ్వరు’.. మాస్ సాంగ్ వచ్చేస్తోంది !

Published on Dec 1, 2019 7:18 PM IST

sari

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను కూడా వేగవంతం చేసింది. కాగా తాజాగా ఈ చిత్రం నుండి చిత్రబృందం ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ‘మైండ్ బ్లాంక్’ అనే మాస్ లిరికల్ సాంగ్ రాబోతుందని పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. సాంగ్ రేపు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చిన మహేష్ బృందం ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు.

కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు