క్రిస్మస్ కి సినిమాల సందడి బాగానే ఉంది..!

క్రిస్మస్ కి సినిమాల సందడి బాగానే ఉంది..!

Published on Dec 4, 2019 1:16 PM IST

TFI

సంక్రాంతి కి ముందే క్రిస్మస్ ఫెస్టివల్ కి స్టార్ హీరోల సినిమాలతో పాటు కుర్ర హీరోలు తమ సినిమాలతో సందడి చేయనున్నారు. సంక్రాంతి సింహంగా పేరున్న బాలయ్య ఈ సారి సంక్రాంతిని వదిలేసి క్రిస్మన్ కే ఫ్యాన్స్ కి పండుగ తెస్తున్నారు. ఆయన నటిస్తున్న రూలర్ మూవీ డిసెంబర్ 20న విడుదల అవుతుంది. బాలయ్య రెండు భిన్నమైన పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక లెజెండరీ ప్రొడ్యూసర్ స్వర్గీయ రామానాయుడు డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వెంకీ మామ మూవీ డిసెంబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రం క్రిస్మస్ కి రెండు వారాలు ముందే విడుదల అవుతున్నప్పటికీ రూలర్ మూవీ విడుదల ఐయ్యేవరకూ చిన్న సినిమాలు మినహా చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేదు. కాబట్టి వెంకీ మామ రన్ ఢోకా లేకుండా క్రిస్మస్ వరకు నడుస్తుంది.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రతిరోజూ పండుగే చిత్రం విడుదల తేదీ డిసెంబర్ 20గా ప్రకటించారు. అదేరోజు రూలర్ కూడా విడుదల నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రతిరోజూ పండుగే తెరకెక్కింది. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ పండుగ రోజే ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రంతో దిగుతున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్ రాజు నిర్మించడం విశేషం. ఇక చిన్న చిత్రాలు కొన్ని విడుదలయ్యే అవకాశం కలదు. ఇలా వరుస సినిమాల విడుదల తో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది.

తాజా వార్తలు