రేపు విడుదలకానున్న అరడజనుకు పైగా సినిమాలు

రేపు విడుదలకానున్న అరడజనుకు పైగా సినిమాలు

Published on Dec 5, 2019 12:24 PM IST

tollywood1

ఈ వారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో చిన్న సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం, ఆ పై వారం ‘వెంకీ మామ, రూలర్, ప్రతిరోజూ పండగే’ లాంటి పెద్ద సినిమాలు విడుదలకానుండటంతో ఈ వారమే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చిన్న సినిమాల నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అందుకే రేపు 6వ తేదీనాడు అరడజనకుపైగా సినిమాలు విడుదలవుతున్నాయి.

వాటిలో కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’, శ్రీనివాస రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’, ఐశ్వర్య రాజేష్, ఉదయ్ శంకర్ కలిసి నటించిన ‘మిస్ మ్యాచ్’ చిత్రాలు మంచి ప్రాచుర్యం నడుమ విడుదలకానుండగా ‘అశ్వమేథం, వజ్రాల వేట, మేరా దోస్త్, కలియుగ’ లాంటి చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. అలాగే హిందీ ప్రేక్షకుల కోసం ‘పానిపట్’ లాంటి సినిమా కూడా విడుదలకానుంది. సో.. రేపు ప్రేక్షకులకు థియేటర్లలో చాలా ఆప్షన్లు ఉండనున్నాయి.

తాజా వార్తలు