కన్నడ హీరో యాష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కెజిఎఫ్’ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో రెండవ భాగం ‘కెజిఎఫ్ 2’పై అమితాశక్తి నెలకొంది ప్రేక్షకుల్లో. దాంతో నిర్మాతలు ద్వితీయ భాగాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పాత్రల కోసం స్టార్ నటీనటుల్ని తీసుకున్నారు.
ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో హైప్ మరింత పెరిగింది. ప్రశాంత్ నీల్ సినిమాను పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో తెరకెక్కిస్తున్నాడని అర్థమైంది. ఇక సంజయ్ దత్ ఇటీవలే హైదరాబాద్లో జరిగిన చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ షెడ్యూల్ లో తెరకెక్కించిన సీన్స్ అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది.


