చైతూ కొత్త డైరెక్టర్స్ తో చేయకపోవడానికి కారణం ఇదా?

చైతూ కొత్త డైరెక్టర్స్ తో చేయకపోవడానికి కారణం ఇదా?

Published on Dec 11, 2019 10:41 PM IST

Naga Chaitanya

వెంకీ మామ మూవీ విడుదలకు ఇంకా కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీనితో చిత్ర యూనిట్ విరివిగా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కాగా నేడు హీరో నాగ చైతన్య పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. వెంకీ మామ చిత్రం గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్న నాగచైతన్య ఆయన కొత్త దర్శకులతో ఎందుకు చిత్రాలు చేయడం లేదు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. ”నేను దర్శకుల హీరోని, కాబట్టి దర్శకులు చెప్పింది బ్లైండ్ గా చేసేస్తాను, అది నా వీక్ నెస్” అన్నారు.

ఇంకా మాట్లాడుతూ ”కొత్త దర్శకులు నేను సరిగా చేయకున్నప్పటికీ వారికంటే నేనే సీనియర్ ని కావడం వలన ఆ విషయం నాకు చెప్పడానికి భయపడతారు. దీనివలన నా నుండి వారు బెస్ట్ అవుట్ ఫుట్ రాబట్టలేరు. సీనియర్ దర్శకులైతే నేను మంచి అవుట్ ఫుట్ ఇచ్చేవరకు టేక్ లు తీసుకుంటూ నా నుండి బెస్ట్ పర్ఫార్మెన్సు రాబడతారు. అందుకే రెండు మూడు హిట్ మూవీస్ చేసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే వరకు కొత్త దర్శకులతో చేయకూడదు అనుకుంటున్నాను” అని చైతూ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు