‘కొరటాల – మెగాస్టార్’ సినిమా రిలీజ్ డేట్ ఆ రోజేనా ?

‘కొరటాల – మెగాస్టార్’ సినిమా రిలీజ్ డేట్ ఆ రోజేనా ?

Published on Dec 16, 2019 10:40 PM IST

chiru koratala

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌ లో త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి… సినిమాని 2020లో స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్‌ గా ఆగస్టు 14న విడుద‌ల చేయాలని ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ ఉండనుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషనే హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారని.. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు సమాచారం.

తాజా వార్తలు