‘దొంగ’ కూడా ‘ఖైదీ’ స్థాయిలోనే కొల్లగొట్టాలి

‘దొంగ’ కూడా ‘ఖైదీ’ స్థాయిలోనే కొల్లగొట్టాలి

Published on Dec 17, 2019 7:00 PM IST

donga

తమిళ హీరో కార్తి ‘ఖైదీ’ చిత్రంతో మరోసారి తెలుగు మార్కెట్లో బలమైన స్థానం సంపాదించుకున్నాడు. మూడున్నర కోటికి ఈ చిత్ర హక్కులు అమ్ముడవగా సినిమా రూ.7 కోట్లు రాబట్టి వంద శాతం లాభాల్ని అండించింది. దీంతో కార్తిపై నమ్మకముంచిన హర్షితా మూవీస్ రావూరి వి శ్రీనివాస్ ఆయన తాజా చిత్రం ‘దొంగ’ హక్కుల్ని మంచి ధర చెల్లించి కొనుగోలు చేశారు.

ట్రెడ్ వర్గాల సమాచారం మేరకు ‘దొంగ’ బ్రేక్ ఈవెన్ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో రూ.3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు చూడాలంటే మాత్రం ‘ఖైదీ’ స్థాయి విజయం తప్పనిసరి. మరి డిసెంబర్ 20న ‘రూలర్, ప్రతిరోజూ పండగే’ లాంటి పెద్ద సినిమాలతో పోటీగా దిగుతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. జీతూ జోసెఫ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో జ్యోతిక కార్తికి సోదరిగా నటించడం జరిగింది.

తాజా వార్తలు