రజిని డ్రీం రోల్ అదే…, ఇన్నేళ్ళుగా ఆయన కోరిక అలానే ఉంది.

రజిని డ్రీం రోల్ అదే…, ఇన్నేళ్ళుగా ఆయన కోరిక అలానే ఉంది.

Published on Dec 18, 2019 1:07 AM IST

Rajinikanth

తలైవా రజిని దర్బార్ మూవీ ట్రైలర్ నిన్నటి విడుదలై యు ట్యూబ్ నందు రికార్డు వ్యూస్ దక్కించుకుంటూ దూసుకెళుతుంది. ట్రైలర్ నేను బాడ్ పోలీస్ అని చెప్పడంతో రజిని పోలీస్ పాత్రలో మురుగదాస్ కొత్తగా చూపించనున్నాడని అర్థం అవుతుంది. కాగా నిన్న ముంబై వేదికగా దర్బార్ ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది. పాత్రికేయుల సమక్షంలో దర్బార్ ట్రైలర్ విడుదల చేయడంతో పాటు పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఐతే ఒక పాత్రికేయుడు మీ డ్రీం రోల్ ఏమిటని రజినీని అడుగగా ఆయన షాకింగ్ ఆన్సర్ చెప్పారు.

‘ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది’ అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. ‘నేను ఇప్పటి వరకు 160 సినిమాల్లో నటించాను. సినీ ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు గడిచిపోయాయి. నాకు ట్రాన్స్‌జెండర్‌ పాత్ర చేయాలని ఉంది’ అని చెప్పుకొచ్చారు. అయితే దర్శకులు ఎవరైనా.. ట్రాన్స్‌జెండర్‌ పాత్ర చేయాలని మిమ్మల్ని సంప్రదించారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు ఎవరు నన్ను సంప్రదించలేదు. మొదటిసారిగా నా కోరికను వ్యక్తపరిచాను’ అని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు