మాస్ మహారాజ రవితేజ తన తర్వాతి చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛ్ అయిన ఈ సినిమాకు ‘క్రాక్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు దర్శక నిర్మాతలు ఇంతకుముందే తెలిపారు. ఒకవైపు ‘డిస్కో రాజా’ పనులు చివరి దశలో ఉండగానే రవితేజ ‘క్రాక్’ షూటింగ్ స్టార్ట్ చేసేశారు.
తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నైట్ ఎఫెక్ట్లో ఒక భారీ ఫైట్ సీన్ షూట్ చేశారట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్స్ రామ్, లక్ష్మణ్ ఈ ఫైట్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించనున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించనుండగా వరలక్ష్మీ శరత్ కుమార్, సముథిరఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో రవితేజ, గోపిచంద్ మలినేనిల కలయికలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి ఎంటెర్టైనర్లు వచ్చి ఉండటంతో ఈసారి కూడా అలాంటి సినిమానే ఆశిస్తున్నారు ప్రేక్షకులు.


