స్టార్ ప్రొడ్యూసర్ తో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ

స్టార్ ప్రొడ్యూసర్ తో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ

Published on Dec 18, 2019 9:23 AM IST

VD12

విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్రకటిస్తూ తన ఫామ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ తో ఓ భిన్నమైన లవ్ స్టోరీ చేస్తున్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నలుగురు అమ్మాయిలతో విజయ్ భిన్న లుక్స్ అండ్ రోల్స్ లో కనిపిస్తున్నాడు. ఇటీవలే నలుగురి హీరోయిన్స్ తో ఉన్న విజయ్ లుక్స్ విడుదల చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు విడుదల కానుంది. కాగా నేడు విజయ్ ఓ ఆసక్తికర ప్రాజెక్ట్ ప్రకటించారు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన నేడు దిల్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం జరిగింది. కాగా నాని కి నిన్ను కోరి లాంటి క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ ఏడాది నాగ చైతన్య తో మజిలీ మూవీ చేసి మరో హిట్ కొట్టారు. ఇప్పుడు విజయ్-దిల్ రాజు ల చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.

తాజా వార్తలు