మెలోడీ సాంగ్ తో రొమాంటిక్ గా వచ్చిన ‘అశ్వథామ’

మెలోడీ సాంగ్ తో రొమాంటిక్ గా వచ్చిన ‘అశ్వథామ’

Published on Dec 19, 2019 3:20 PM IST

Ninne

యంగ్ హీరో నాగ శౌర్య చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అశ్వథామ. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కథ నాగ శౌర్య అందించడం విశేషం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం 2020 జనవరి 31న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ పై ద్రుష్టి పెట్టారు. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ నేడు వైజాగ్ వెళ్లారు. ఉదయం పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. అలాగే వైజాగ్ లోగల విజ్ఞాన్, గీతం కాలేజీ విధ్యార్దులతో కలిసి సందడి చేయనున్నారు.

కాగా కొద్దిసేపటి క్రితం అశ్వథామ చిత్రం నుండి ‘నిన్నే నిన్నే..’ సాంగ్ విడుదల చేశారు. యంగ్ కపుల్ మధ్య కెమిస్ట్రీ..ఇంటిమసీ తెలియజేసేలా సాగిన ఈ రొమాంటిక్ మెలోడియస్ మనసుని హత్తుకొనేలా ఉంది. ఖచ్చితంగా యూత్ ని ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. శ్రీచరణ్ పాకల అందించిన అద్భుత స్వరాలకు రమేష్ వాకచర్ల సాహిత్యం అందించగా, యామిని గంటసాల, అర్మాన్ మాలిక్ పాడారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ములుపురి నిర్మిస్తున్నారు.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు