మోక్షజ్ఞను బాలయ్య వదిలేలా లేరు

మోక్షజ్ఞను బాలయ్య వదిలేలా లేరు

Published on Dec 20, 2019 9:00 AM IST

Balakrishna 4

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా బాలయ్య వారసుడి కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ బాలయ్య వైపు నుండి ఎలాంటి ప్రకటనా రాలేదు. పైగా మోక్షజ్ఞకు సినిమాలంటే అస్సలు ఆసక్తి లేదని, వ్యాపారాలు చేసే ఆలోచనలో ఉన్నాడని వార్తలొచ్చాయి. వాటికి తోడు మోక్షజ్ఞ తాజా లుక్స్ కూడా ఆయనకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదన్నట్టే ఉన్నాయి.

దీంతో అభిమానులు నిరుత్సాహనికి గురయ్యారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి కలుగుతోందని, సినిమాల గురించి ఇప్పుడిప్పుడే తనతో చర్చిస్తున్నాడని, తప్పకుండా అతన్ని వెండితెరపై చూస్తారని, కానీ అదెప్పుడన్నది మాత్రం చెప్పలేనని అన్నారు. సో.. ఈ మాటలతో బాలయ్య అంత తప్పకుండా తన వారసుడ్ని అభిమానులకు అందిస్తారని రూఢీ అయిపోయింది.

తాజా వార్తలు