కేవలం ఒక్క పాట కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసిన హీరో

కేవలం ఒక్క పాట కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసిన హీరో

Published on Dec 20, 2019 7:17 PM IST

Saravanan

లెజెండ్ శరణన్.. ఈ పేరు దక్షిణాది టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు. ఈయన ప్రముఖ వ్యాపార సముదాయం శరవణ స్టోర్స్ అధినేత. మొదటి నుండి హీరో అవ్వాలనే తపన ఉన్న ఈయన ఎట్టకేలకు అన్నీ సెట్ చేసుకుని హీరో అయ్యారు. జేడీ, జెర్రీ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా లాంఛ్ కాగా తాజాగా ఒక పాటను షూట్ చేశారట టీమ్. ఈ పాటను ఆషామాషీగా చిత్రీకరించలేదు.. భారీ ఇంటీరియర్ సెట్టింగ్స్ వేసి షూట్ చేశారట.

ఇందులో లెజెండ్ శరవణన్, హీరోయిన్ గీతికా తివారీలతో పాటు వందల మండి డ్యాన్సర్స్ పాల్గొన్నారు. ఈ పాట కోసం రూ.10 కోట్ల వరకు ఖర్చు చేశారట శరవణన్. సాధారణంగా రజనీ, విజయ్ ల, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లోని పాటలకు కూడా ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం చాలా అరుదు. అలాంటిది శరవణన్ మాత్రం ఒక్క పాట కోసం అలవోకగా రూ.10 కోట్లు ఖర్చు చేయడం చూస్తే సినిమా కోసం అయన భారీ మొత్తాన్ని పక్కకు తీసిపెట్టుకున్నారని ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం తమిళ పరిశ్రమ మొత్తం ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. పైగా పాటలో శరవణన్ డ్యాన్స్ మూమెంట్స్ బాగా హైలెట్ అవుతాయని, ఆ మూమెంట్స్ చూసిన ఇతర డ్యాన్సర్స్ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారని టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు