లుక్ టెస్ట్ కి సిద్ధం అవుతున్న పవన్ కళ్యాణ్..!

లుక్ టెస్ట్ కి సిద్ధం అవుతున్న పవన్ కళ్యాణ్..!

Published on Dec 22, 2019 3:00 AM IST

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ చిత్రం పింక్ తెలుగు రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం థమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. ఐతే పింక్ హిందీ రీమేక్ చేస్తున్నామని చెప్పిన నిర్మాత ఎక్కడా కూడా హీరో పవన్ కళ్యాణ్ అని వ్యక్తపరచలేదు. కానీ ఈ చిత్రం చేయబోతుంది పవన్ కళ్యాణ్ అని అందరికి తెలిసిన నిజం.

కాగా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో లాయర్ పాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన వచ్చే నెల 7 నుండి లుక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారట. మేకప్ నిపుణుల సమక్షంలో దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ లుక్ ఫైనల్ చేస్తారని సమాచారం. గత చిత్రాలకు భిన్నంగా సహజత్వానికి దగ్గరగా పవన్ లుక్ ఉంటుందని వినికిడి. పాత్ర స్వభావం రీత్యా పవన్ లుక్ అలా డిజైన్ చేయాలని భావిస్తున్నారట. దాదాపు రెండేళ్ల తరువాత మేకప్ వేసుకోనున్న పవన్ లుక్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగాఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు