అలవైకుంఠపురంలో కోసం డబ్బింగ్ చెవుతున్న బన్నీ

అలవైకుంఠపురంలో కోసం డబ్బింగ్ చెవుతున్న బన్నీ

Published on Dec 22, 2019 7:40 PM IST

Allu arjun

బన్నీ ఈసారి సంక్రాంతి బరిలో అలవైకుంఠపురంలో మూవీతో దిగుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు హిట్ కావంతో హ్యాట్రిక్ మూవీ భారీ హిట్ కొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ గత చిత్రం నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా నిరాశపరిచిన నేపథ్యంలో ఆచితూచి ఈ సినిమా ఎంపిక చేసుకున్నారు. కాగా విడుదలకు తేదీ దగ్గరపడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసేపనిలో ఉన్నారు.

బన్నీ అలవైకుంఠపురంలో కొరకు డబ్బింగ్ చెవుతున్నారు. అలాగే ఈ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్న సుశాంత్ కూడా డబ్బింగ్ లో పాల్గొంటున్నారు. మురళి శర్మ, హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పటికే ఈ చిత్ర డబ్బింగ్ పూర్తి చేసినట్టు సమాచారం. కాగా నేడు ఈ మూవీ నుండి ‘బుట్ట బొమ్మ’ సాంగ్ టీజర్ విడుదల చేశారు. పూర్తి సాంగ్ ని ఈనెల 24న విడుదల చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు