‘అసురన్’ దర్శకుడితో సూర్య.. మంచి సినిమా ఖాయం

‘అసురన్’ దర్శకుడితో సూర్య.. మంచి సినిమా ఖాయం

Published on Dec 22, 2019 10:00 PM IST

Surya

ఇటీవలే ‘కాప్పన్’ చిత్రంతో పలరించిన తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సుధా కొంగర డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత అయన హరి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తారని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్లాన్స్ మార్చుకున్నారు సూర్య. ఆయన వెట్రిమారన్ డైరెక్షన్లో నటించేందుకు సిద్దమయ్యారు.

వెట్రిమారన్ గత చిత్రం ‘అసురన్’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. ఈ చిత్రం తర్వాత ఆయనకు పెద్ద నిర్మాతల నుండి స్టార్ హీరోల నుండి పిలుపులు కూడా వెళ్లాయి. అయితే ఆయన మాత్రం సూర్యతో పనిచేయడానికే సుముఖత చూపడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.

ఈ వార్త విన్న సూర్య అభిమానులు ఈసారి తమ హీరో నుండి మంచి సినిమా రావడం ఖాయమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు సైతం వెట్రిమారన్ లాంటి దర్శకుడితో సూర్య లాంటి ఉత్తమ నటుడు పనిచేయడం గొప్ప ఫలితాన్నిస్తుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు