కీలక సన్నివేశాల కోసం రెడీ అవుతోన్న ‘తలైవి’ !

కీలక సన్నివేశాల కోసం రెడీ అవుతోన్న ‘తలైవి’ !

Published on Dec 22, 2019 9:44 PM IST

Thalaivi 1

తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. అలాగే ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.

కాగా తరువాత షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా, అరవింద్ స్వామి మీద ఎలెక్షన్ల సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇవి సినిమాలోనే కీలక సన్నివేశాలట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానం కూడా సినిమాలో హైలెట్ చేస్తూ కథ ఉంటుందట. మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు