సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.. మారుతి దర్శకుడిగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో మొదలైంది. ఎ సెంటర్లలో మంచి కలెక్షన్లను వస్తున్నాయి. శుక్రవారం మొదటిరోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొత్తానికి కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. మూడు రోజుల థియేట్రికల్ రన్ లో టికెట్ కౌంటర్లలో ఆకట్టుకునే గణాంకాలనే నమోదు చేసింది. మూడు రోజులకు గానూ రూ .8.63 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసింది.ఈ చిత్రం యుఎస్ లో $ 200 కె డాలర్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఏరియా ప్రకారం మొదటి మూడు రోజుల కలక్షన్ల షేర్ వివరాలు
| ఏరియ | కలెక్షన్స్ |
| నైజాం | Rs 3.70 కోట్లు |
| సీడెడ్ | Rs 1.09 కోట్లు |
| ఉత్తరాంధ్ర | Rs 1.04 కోట్లు |
| కృష్ణ | Rs 0.62 కోట్లు |
| గుంటూరు | Rs 0.66 కోట్లు |
| నెల్లూరు | Rs 0.34 కోట్లు |
| ఈస్ట్ | Rs 0.69 ఈస్ట్ |
| వెస్ట్ | Rs 0.52 కోట్లు |
| మొత్తం ఏపి & తెలంగాణ మొదటి రెండు రోజుల షేర్ | Rs 8.63 కోట్లు |


