సల్మాన్ ఖాన్ దబంగ్ సిరీస్ లో చేసిన మూడవ చిత్రం దబంగ్ 3 గత వారం విడుదలైంది. కొరియోగ్రఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ క్రిటిక్స్ దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. రివ్యూస్ ఎలా ఉన్నా సల్మాన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. ఈ చిత్ర వసూళ్లు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి.
దబంగ్ 3 చిత్రం మొదటిరోజు 24.50 కోట్ల వసూళ్లు సాధించగా రెండవ రోజు 24.75 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక నిన్న ఆదివారం కావడంతో దబాంగ్ 3 వసూళ్ళలో భారీ పురోగతి కనిపించింది. మూడవ రోజు ఈచిత్రం 31.90 కోట్లు వసూళ్లు సాధించి అబ్బురపరిచింది. మూడురోజులకు గాను దబంగ్ 3 హిందీ వర్షన్ 81.15 కోట్ల వసూళ్లకు చేరుకుంది. దబంగ్ 3 చిత్రంలో కూడా సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటించగా మరో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటించారు. దబంగ్ 3 చిత్రంలో కిచ్చా సుధీప్ విలన్ రోల్ చేయడం విశేషం.


