పాయల్ నిర్ణయం ఆమె కెరీర్ ని మలుపుతిప్పుతుందా..?

పాయల్ నిర్ణయం ఆమె కెరీర్ ని మలుపుతిప్పుతుందా..?

Published on Dec 24, 2019 7:14 AM IST

Payal Rajput

టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మారిన పాయల్ తెలుగులో మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100తో ఎంట్రీ ఇచ్చారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ చేసిన పాయల్ ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నప్పటికీ ఆస్థాయిలో అవకాశాలు రాలేదు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసిన ఈ అమ్మడు ఆ తరువాత సీత చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించారు. ఇక తాజాగా ఆమె ఆర్డీఎక్స్ లవ్ పేరుతో వచ్చిన చిత్రంలో మరో బోల్డ్ రోల్ చేశారు. దాదాపు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించలేదు.

బోల్డ్ హీరోయిన్ గా ముద్ర పడటం వలన స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదని భావించిన పాయల్ ఇకపై అటువంటి రోల్స్ చేయకూడని నిర్ణయించుకున్నారు. మరి బోల్డ్ రోల్స్ చేయడం మానేయడం ద్వారా ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్న పాయల్, ఓ తమిళ హారర్ మూవీలో నటిస్తున్నారు. వెంకీ మామ చిత్రంలో పాయల్ హిందీ టీచర్ రోల్ చేశారు.

తాజా వార్తలు