‘డిస్కో రాజా’.. అంతా బాగుందట

‘డిస్కో రాజా’.. అంతా బాగుందట

Published on Dec 24, 2019 9:22 AM IST

Disco Raja

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయన అభిమానులు సైతం ఈ చిత్రం ద్వారా తమ హీరో పూర్వపు ఫామ్లోకి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇక సినిమా ఎలా ఉందనే విషయమై చిత్ర బృందాన్ని కదిలిస్తే ఔట్ పుట్ బాగా వస్తోందని, రవితేజ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా బాబీ సింహ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

తాజా వార్తలు