ఆ సెన్సేషనల్ దర్శకుడితో ప్రభాస్ మూవీ అంటున్నారుగా…?

ఆ సెన్సేషనల్ దర్శకుడితో ప్రభాస్ మూవీ అంటున్నారుగా…?

Published on Dec 25, 2019 7:16 AM IST

Prabhas2

విజయ్ దేవరకకొండ హీరోగా 2017లో దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మొదటి చిత్రంతోనే సూపర్ ఫేమస్ అయ్యాడు. ఈ ఏడాది ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డెవిల్ పేరుతో బాలీవుడ్‌లోనే మరో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు సందీప్. అయితే ఈ మూవీ అయిన తరువాత మళ్లీ టాలీవుడ్‌కే రావాలని ఆయన అనుకుంటున్నారట. ఈ క్రమంలో ప్రభాస్‌తో తదుపరి సినిమా తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల డార్లింగ్‌కు సందీప్ ఓ కథను చెప్పడం.. దానికి అతడు ఓకే చెప్పేయడం జరిగిపోయాయని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అంతేకాదు సందీప్ రెడ్డికి బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడటంతో.. అది కూడా తనకు ఫ్లస్ అవుతుందని ప్రభాస్ భావిస్తున్నాడట.

కాగా ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ ప్రేమ కథగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు