వెంకటేష్ మహా సినిమాకు టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్

వెంకటేష్ మహా సినిమాకు టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 26, 2019 2:00 AM IST

Venkatesh

‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ అనే వైవిధ్యమైన సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వెంక‌ట్ మహా త‌దుప‌రి సినిమాను తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. మ‌ల‌యాళంలో సూప‌ర్‌హిట్టైన ‘మ‌హేషింటే ప్ర‌తీకారం’ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు ఆయన. దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు రీమేక్ పనులు సాగుతున్నాయి.

ఈ చిత్రానికి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 17న విడుదలచేయాలని నిర్ణయించారు. బిగ్గెస్ట్ తెలుగు బ్లాక్ బస్టర్ అయిన ‘బాహుబలి’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు, ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటించబోయే ప్రధాన తారాగణం ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తాజా వార్తలు