ఆర్ ఆర్ ఆర్ హీరోలు రిలాక్స్ అయ్యారా..?

ఆర్ ఆర్ ఆర్ హీరోలు రిలాక్స్ అయ్యారా..?

Published on Dec 26, 2019 8:31 AM IST

RRR

రాజమౌళి తన అన్న కీరవాణి కొడుకులు చేసిన మొదటి చిత్రం ‘మత్తువదలరా’ చిత్ర విడుదల నేపథ్యంలో ఆయన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాజమౌళి మత్తు వదలరా ప్రీమియర్ షో చూడటం జరిగింది. కాగా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ విషయంలో అనేక ఊహాగానాలు వినబడుతున్న తరుణంలో మత్తు వదలరా ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆయన మత్తు వదలరా లాంటి ఒక చిన్న సినిమాను సంవత్సరం నుండి తీస్తున్నారు నేను ఆర్ ఆర్ ఆర్ లాంటి ఓ భారీ చిత్రం మూడేళ్లు తీస్తే తప్పేముంది అని ఆయన చమత్కరించారు. ఐతే ప్రకటించిన విధంగా 2020 జులై 30న ఆర్ ఆర్ ఆర్ వస్తుందని మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

దీనితో రాజమౌళి మూవీ విడుదల వాయిదా వేశారా అనే అనుమానం కూడా కలుగుతుంది. అనుకున్న విధంగా ఈ మూవీని జులై 30న విడుదల చేసే పరిస్థితులు లేని పక్షంలో ఆయన విడుదల తేదీ వెనక్కి జరిపే అవకాశం ఉంది. డేట్ ప్రకటించాం కదా అని హడా విడిగా మూవీ తీసి విడుదల చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని రాజమౌళి ప్రశాంతంగానే ఈ మూవీని తెరకెక్కింద్దాం అని డిసైడ్ అయ్యారా… అందుకే ఆర్ ఆర్ ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారా అనిపిస్తుంది. మరి చూడాలి రాజమౌళి అనుకున్న టైముకే ఆర్ ఆర్ ఆర్ ని థియేటర్స్ లో దించుతారో లేక వాయిదా వేస్తారో?

తాజా వార్తలు