అశ్వథామ కొరకు సమంత వస్తుంది..!

అశ్వథామ కొరకు సమంత వస్తుంది..!

Published on Dec 26, 2019 12:02 PM IST

Aswathama 3

యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ అశ్వథామ. నూతన దర్శకుడు రమణ తేజ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే అశ్వథామ చిత్రం కొరకు హీరో నాగ శౌర్య పూర్తిగా మేక్ ఓవర్ అయ్యాడు. ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ డెవలప్ చేసిన ఆయన తనని తాను ఓ మాస్ హీరోగా మార్చుకున్నాడు. అన్యాయాలను ప్రశ్నించే యువకుడిగా నాగ శౌర్య రోల్ ఉంటుందిట.

కాగా రేపు ఈ చిత్ర టీజర్ ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఓ బేబీ సమంత విచ్చేస్తున్నారు. ఆమె చేతుల మీదుగా అశ్వథామ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాతలు ఓ ప్రకటన చేశారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ములుపురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ శౌర్య కు జంటగా మొదటిసారి మెహ్రీన్ నటిస్తుంది. శ్రీ చరణ్ పాకల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 31న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు