రవితేజ ఎన్నో ఆశలతో చేస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. విఐ అనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. టీజర్లో సైతం ప్రయోగాలకు సంభందించిన సాట్స్ కనబడటంతో సినిమాలో ఏదో పెద్ద రీసెర్చ్ ఉందనే అంచనాలు మొదలయ్యాయి ప్రేక్షకుల్లో. తాజాగా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఇంతకీ సినిమాలో ఉండబోయే సైంటిఫిక్ ఎలిమెంట్ ఏమిటని దర్శకుడ్ని అడిగారు.
విఐ ఆనంద్ సమాధానం చెబుతూ సినిమాలో సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందని, అది ప్రేక్షకులు నమ్మేలా, వాస్తవానికి దగ్గరగా ఉంటుందని, సినిమా ఒక లాజికల్ ఫన్ రైడ్ అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఇందులో నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ కథానాయికలుగా నటించారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా బాబీ సింహ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.


