పూరి, పవన్ మూవీ అంటున్నారే..?

పూరి, పవన్ మూవీ అంటున్నారే..?

Published on Dec 28, 2019 11:30 AM IST

Pawan Kalyan

పవన్ రీ ఎంట్రీ పై పూర్తిగా స్పష్టత రాలేదు. ఎందుకనగా పవన్ గాని, ప్రచారమవుతున్న దర్శక నిర్మాతలు కానీ పవన్ మా మూవీలో నటిస్తున్నారంటూ స్వయంగా ప్రకటించింది లేదు. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించడంతో పవన్ రీ ఎంట్రీ ఖాయమే అని అందరూ భావిస్తున్నారు. ఇన్ని ప్రచారాలు, రోజూ అప్డేట్స్ వస్తున్నా, పవన్ నోరుమెదపక పోవడం కూడా ఆయన రీ ఎంట్రీని ధృవీకరిస్తుంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ తో పాటు, క్రిష్ దర్శకుడిగా ఓ పీరియాడిక్ స్టోరీ లో పవన్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇవి కాకుండా పూరి, పవన్ ల మూవీ కూడా తెరపైకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఓ సినిమా విషయమై పూరి, పవన్ ని కలిసారని, ప్రస్తుతానికి తాను ఒప్పుకున్న ప్రాజక్ట్స్ పూర్తి అవ్వగానే మీతో సినిమా చేస్తానని పవన్ మాటిచ్చారని కొందరు అంటున్నారు. ఇక ఆ సినిమా కోసం అతి త్వరలో పూర్తి స్థాయిలో కథని డెవలప్ చేసే పనిలో ఉన్నారట పూరి. అన్నీ కలిసి వస్తే, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ మూవీ కొరకు సన్నద్ధం అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు