యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `అశ్వథ్థామ`. కాగా నిన్న ఈ చిత్రం టీజర్ ను విడుదల అయిన సంగతి తెలిసిందే. అత్యంత గ్రిప్పింగ్ గా ఉన్న ఈ టీజర్ కు యూట్యూబ్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. కేవలం 24 గంటల్లో 4.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను సాధించింది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ టీజర్ అగ్రస్థానంలో ఉంది. టీజర్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య ఈ చిత్రంలో మాస్ హీరోలా సరి కొత్తగా కనిపిస్తున్నాడు.
కాగా నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ ఉన్నాయట. మొదటిసారి ఈ చిత్రంలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహరిన్ హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకుల అలరించబోతుంది. పోసాని కృష్ణమురళీ, సత్య, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీచరణ్, కెమెరా మనోజ్ రెడ్డి, ఎడిటర్ గారీ బిహెచ్, డైరెక్షన్ రమణ్ తేజ, ప్రొడ్యూసర్ ఉషా ముల్పూరి,


