ఉల్లాల ఉల్లాల ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది- అంకిత

ఉల్లాల ఉల్లాల ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది- అంకిత

Published on Dec 29, 2019 3:03 PM IST

anketha

నటరాజ్, అంకిత మహరాన, నూరిన్ షరీఫ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ హారర్ మూవీ ఉల్లాల ఉల్లాల. ఒకప్పటి టాలీవుడ్ విలన్ సత్య ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.హీరో నటరాజ్ సత్య ప్రకాష్ కుమారుడు కావడం విశేషం. 2020 జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంధర్భంగా హీరోయిన్ అంకిత మహారాణ మీడియాతో ముచ్చటించారు.

తెలుగులో నా మొదటి చిత్రం “ఊల్లాల ఊల్లాల”. లవర్స్ డే తెలుగులో డబ్బింగ్ అయ్యాక ఇక్కడి వాళ్ళు నాపై చాలా అభిమానం చూపించారు. “ఊల్లాల ఊల్లాల” పూర్తిగా వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులకి కావలసిన థ్రిల్లింగ్, కామెడీ, ప్రేమ, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ఉన్నసినిమా. పల్లెటూరు నేపథ్యమున్న అమ్మాయి నూరి గా ఈ చిత్రంలో హీరో నటరాజ్ ని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తాను, అని అన్నారు.

ఇక దర్శకుడు సత్య ప్రకాష్, హీరో నటరాజ్ లతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమపై ఆమె ప్రశంశలు కురిపించారు. టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఇచ్చే గౌరవం మర్యాద చాలా నచ్చిందన్న అంకిత… ఉల్లాల ఉల్లాల మూవీ అందరికీ నచ్చు తుంది, మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు