ఇన్నాళ్ళు గ్లామర్ పాత్రల్లో మెరిసిన హీరోయిన్ క్యాథరిన్ థ్రెస త్వరలో మొదలుకానున్న బాలకృష్ణ, బోయపాటి సినిమాలో ఒక కీలక పాత్ర చేయనుంది. ఇందులో ఆమె ఒక ఐపీఎస్ పాత్రలో కనిపించనుంది. సినిమా చాలా వరకు రాజకీయాల చుట్టూ తిరిగేదిగా ఉంటుందట. అందులో క్యాథరిన్ చేయనున్న ఐపీఎస్ పాత్ర కీలకంగా ఉంటుందట.
గతంలో కూడా క్యాథరిన్ అల్లు అర్జున్ యొక్క ‘సరైనోడు’ చిత్రంలో ఎమ్ఎల్ఏ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ జనవరి మొదట్లో మొదలుకానుంది. ఇకపోతే ఇందులో కథానాయిక ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.


