కొత్త టాలెంట్ ను కొత్త కథలను జడ్జ్ చేయడంలో హీరో నానికి మంచి పట్టు ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో రెగ్యులర్ గా వినిపించే డైలాగ్. అందరూ అనుకున్నట్లుగానే ‘నాని’ కూడా ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరోగా నాని హవానే కొనసాగుతుంది. కథ బాగుంటే దర్శకుడి ట్రాక్ రికార్డ్ ను కూడా పట్టించుకోకుండా, నాని కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే శ్రీకాంత్ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ విని.. అతనితో సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా మరో కొత్త దర్శకుడికి కూడా నాని ఛాన్స్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. క్రిష్ దగ్గర అసోసియేట్ గా పనిచేస్తోన్న అనిల్ అనే డైరెక్టర్ చెప్పిన కథ నానికి బాగా నచ్చిందట. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘వి’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక నాని హీరోగా నటించిన అతని గత చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ బాక్సాఫీస్ వద్ద ఎబౌవ్ ఏవరేజ్ సినిమాగా నిలిచింది.


