నిర్మాతను కొట్టలేదంటున్న హీరోయిన్

నిర్మాతను కొట్టలేదంటున్న హీరోయిన్

Published on Dec 30, 2019 6:32 PM IST

Sanjjanaa

ప్రముఖ నటి సంజన గల్రాని బెంగుళూరులోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో వందన జైన్ అనే నిర్మాతను లిక్కర్ బాటిల్ తో కొట్టినట్టు వచ్చిన వార్తలు పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. సంజన తనను ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్టు వందన జైన్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది.

తాజాగా ఈ వివాదంపై వివరణ ఇచ్చిన సంజన అసలు తాను వందనపై దాడి చేయలేదని, ఆమే తనపై దాడి చేసిందని చెబుతోంది. పార్టీలో ఉండగా వందన తనతో వాగ్వాదానికి దిగి, తనను, తన కుటుంబ సభ్యులకలను అసహ్యకరమైన రీతిలో తిట్టిందని, ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నించినా తనను, తన కుటుంబాన్ని నాశనం చేస్తానని వందన జైన్ బెదిరించిందని, పైగా తన మీదే తప్పుడు కేస్ పెట్టిందని వివరించింది.

వందన జైన్ ట్రాప్లో ఇరుక్కున తనకు మీడియా, పోలీసులు, అభిమానుల నుండి సహకారం కావాలని, మీడియా మిత్రులు తాను దాడి చేసినట్టు ప్రచురించిన వార్తలను తొలగించాలని రిక్వెస్ట్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు