ఈమధ్య ‘రాజుగారి గది 2, మన్మథుడు 2, దేవదాస్’ లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో కనిపించిన అక్కినేని నాగర్జున మళ్లీ పంథా మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు. తనకు కలిసొచ్చిన యాక్షన్ జానర్లోకే తిరిగి కొనసాగాలనుకుంటున్నారు. అయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘మన్మథుడు 2’ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా స్టార్ట్ చేశారు.
ఇందులో ఆయన ఒక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కూడా యాక్షన్ సినిమానే అంటున్నారు. ఇందులో నాగ్ ఆదాయ పన్ను శాఖ అధికారిగా కనిపిస్తారట. ఇది బాలీవుడ్ చిత్రం ‘రైడ్’ను పోలి ఉంటుందని టాక్. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది.


