స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ‘సామజవరగమన’ సాంగ్ టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సాంగ్ వీడియో ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రోమోలో బన్నీ డాన్స్ మూమెంట్స్, పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్సీ అలాగే సాంగ్ షూట్ చేసిన విధానాం అద్భుతంగాఉన్నాయి. బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఈ సాంగ్ ఉండబోతుందని ఈ వీడియో ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ సాంగ్ ను సిడ్ శ్రీరామ్ చక్కగా పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు.
కాగా బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సాంగ్ వీడియో ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


