మాస్ మహారాజ రవితేజ చేస్తున్న చిత్రాల్లో ‘క్రాక్’ కూడా ఒకటి. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని ప్రకటించారు. ఈరోజు న్యూఇయర్ సందర్బంగా విడుడలచేసిన ఫస్ట్ లుక్ కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించనుండగా వరలక్ష్మీ శరత్ కుమార్, సముథిరఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో రవితేజ, గోపిచంద్ మలినేనిల కలయికలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి ఎంటెర్టైనర్లు వచ్చి ఉండటంతో ఈసారి కూడా అలాంటి సినిమానే ఆశిస్తున్నారు ప్రేక్షకులు.


