సెకెండ్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్ చేసిన యాక్షన్ హీరో !

సెకెండ్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్ చేసిన యాక్షన్ హీరో !

Published on Jan 2, 2020 1:08 AM IST

Gopichand2

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ కోసం డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 18న నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. కాగా ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు