ఆకట్టుకుంటున్న మహేష్ బాబు మాస్ కటౌట్స్

ఆకట్టుకుంటున్న మహేష్ బాబు మాస్ కటౌట్స్

Published on Jan 2, 2020 10:09 PM IST

sarileru nekevaru

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదల అంటే అభిమానుల హడావుడి తారా స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన థియేటర్లలో వేలిసే మహేష్ కటౌట్లు స్పెషల్ అట్రాక్షన్. ఈ జనవరి 11న విడుదలకానున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం నుండే భారీ కటౌట్లు సిద్దం చేస్తున్నారు అభిమానులు. థియేటర్ యాజమాన్యాల సహకారంతో ఇప్పటికే కొన్ని చోట్ల మాస్ కటౌట్స్ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ నగరంలో మహేష్ బాబుకు మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 35 ఎమ్ ఎమ్, విజయవాడ, భీమవరం లాంటి చోట్ల వెలిసిన భారీ కటౌట్లు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదల సమయానికి మరిన్ని థియేటర్లలో కటౌట్స్ ఏర్పాటుకానున్నాయి. ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సినిమాకు ఈ స్థాయి హైప్ ఏర్పడింది.

దర్శకుడు అనిల్ రావిపూడి సైతం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా అభిమానులు ఆశించిన స్థాయిలోనే ఉంటుందని, కేవలం కామెడీ మాత్రమే కాకుండా చాలా విలువలు కూడా ఉంటాయని అన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు