సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు పోటీ పడటం కొత్తేమీ కాదు. చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ అనేక స్టార్లు సంక్రాంతి పోటీలో దిగారు. ఐతే 2020 సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న మహేష్, బన్నీ చిత్రాల విషయంలో ఒకరకమైన అనారోగ్య కరమైన పోటీ నెలకొంది. ఈ రెండు చిత్రాల విడుదల విషయంలో నిర్మాతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. మొదట సరిలేరు నీకెవ్వరు మూవీ జనవరి11న ఆనెక్స్ట్ డే 12న అలవైకుంఠపురంలో విడుదల కానున్నట్లు దాదాపు అధికారికంగా ప్రకటించేశారు. ఐతే కొద్దిరోజుల క్రితం అనుకోకుండా లెక్కలు మారాయి. బన్నీ నిర్మాతలు అలవైకుంఠపురంలో చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
దీనితో సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు కూడా తమ విడుదల తేదీ మార్పు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ అలవైకుంఠపురంలో జనవరి 10న విడుదలయ్యే పక్షంలో తాము కూడా అదే తారీఖున పోటీగా విడుదల చేయాలని చూస్తున్నారట. ముందుగా అనుకున్నట్లు బన్నీ తన సినిమాను 12న విడుదల చేస్తే మహేష్ సరిలేరు నీకెవ్వరు యథావిధిగా 11న విడుదల చేస్తారు. ఐతే ఈ రెండు సినిమాల నిర్మాతలు ఎవరు ముందుగా రిలీజ్ డేట్ ప్రకటిస్తే దానికి అనుకూలంగా తమ మూవీ విడుదల తేదీ ప్రకటించాలని ఎదురుచూస్తున్నారు. పండుగ వేడి మొదలు కావడానికి వారం రోజు కూడా లేని తరుణంలో ఇంకా విడుదల తేదీ విషయంలో సందిగ్థత కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


