మహేష్, బన్నీ కాంప్రమైజ్ అయ్యారు..!

మహేష్, బన్నీ కాంప్రమైజ్ అయ్యారు..!

Published on Jan 4, 2020 6:00 PM IST

ala sarileru

గత వారం రోజులుగా సంక్రాంతి బడా సినిమాలైన అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల విడుదల తేదీల విషయంలో సందిగ్దత కొనసాగుతుంది. పండుగ వేడి ఇంకా కొద్దిరోజులలో మొదలుకానున్న తరుణంలో ఈ రెండు భారీ చిత్రాల నిర్మాతలు విడుదల తేదీలపై స్పష్టత ఇవ్వకపోవడంతో అటు సినీ ప్రేమికులలో, డిస్ట్రిబ్యూటర్స్ నందు ఆందోళన నెలకొంది. ఈ అనుమానాలకు చెక్ పెడుతూ సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్న దిల్ రాజు మీడియా సమావేశం ద్వారా స్పష్టత ఇవ్వనున్నారు.

ఐతే తాజా సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు మూవీ, అలవైకుంఠపురంలో చిత్రాలు యధావిధిగా ముందుగా అనుకున్న విధంగా జనవరి 11 మరియు 12తేదీలలో విడుదల కానున్నాయి. సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో ఎటువంటి మార్పులేదని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా జనవరి 15న ఇక దర్బార్ 9న విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు